Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్.. వర్షాలు షురూ!
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కాస్త ఆలస్యం అవ్వడం వల్ల వర్షాలు ఆలస్యంగా మొదలు అయ్యాయి. జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం నమోదు అవ్వలేదు. కానీ జులై నెలలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రైతులు వ్యవసాయ పనులతో బిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జూన్ చివరి వరకు కూడా ఎండ వేడితో.. ఉక్కబోతతో అల్లాడిపోయిన జనాలు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చల్లబడ్డారు.
మహబూబాబాద్.. వరంగల్.. జనగామా.. ములుగు జిల్లాల్లో గురువారం రాత్రి నుండి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదు అవుతున్నట్లుగా వాతావరణ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆ 18 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లగా అధికారులు పేర్కొన్నారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద భారీ వర్షాలతో పెద్ద వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొటుకు పోయింది. దాంతో రాకపోకలకు ఆటంకం కలుగుతున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు.
Also Read: ట్విస్ట్ అదిరింది.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్ట్ ల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాల్లో వర్షాదార పంటలు వేస్తారు. ప్రస్తుతం ఆ జిల్లాల్లో వ్యవసాయ పంటలు ఊపందుకున్నాయి. రాబోయే మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జల్లులు పత్తి చేనుతో పాటు పలు వర్షాదార పంటలకు ఉపయోగదాయకం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరి నార్లు పోసి ఉన్నాయి. ఈ వర్షాలతో పొలాలు దున్ని నాట్లు వేసే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వేడుకలోనే 'ప్రాజెక్టు-కే' టైటిల్ రివీల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి